యేసయ్య
యేసయ్య
అండ దందా నీవే నాకు పరిశుద్ధుడా
నా గుండె పొంగి పోయే నీకు స్తుతి పాడెద
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
నీవే నా గానము
నీవే నా ధ్యానము
నీవే నా సర్వము
నీవే నా శృంగము
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
జీవ వాక్కులను నాతో మాట్లాడితివే
ఆత్మైశ్వర్యముతో అలంకరించితివే
జీవ వాక్కులను నాతో మాట్లాడితివే
ఆత్మైశ్వర్యముతో అలంకరించితివే
నన్ను ప్రియమార నీ కౌగిట చేర్చుకొంటివి
నేను మనసారా నీ వశమై నిలిచియుంటిని
ప్రాణ నాథుడా
నా ప్రియా యేసయ్య
ప్రాణ నాథుడా
నా ప్రియా యేసయ్య
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
మురిసెను మనసే నీ సన్నిధి నిధిలో
కురిసేను మమతే నా మదిలో మదిలో
మురిసెను మనసే నీ సన్నిధి నిధిలో
కురిసేను మమతే నా మదిలో మదిలో
ఈ ఆత్మానందము సదా నా సొంతము
ఈ స్తుతి గానము సదా నీకంకితము
నా ప్రసన్నుడ నా ఆసన్నుడ
నా ప్రసన్నుడ నా ఆసన్నుడ
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
నీవే నా గానము
నీవే నా ధ్యానము
నీవే నా సర్వము
నీవే నా శృంగము
నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
YOUTUBE LINK : NINDU PARAVASAME
Leave a Reply