Lyrics
రండి స్తుతించుచు పాడుడి –
రారాజు యేసుని చేరుడి
”హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ”
ప్రభు యేసు కాంతిలో నిలచి –
సాగించు జీవితయాత్ర
బాధలన్నిటిన్ బాపున్ –
భజియించు యేసుని నామం
||హల్లెలూయి||
విలువైన నీ జీవితమున్ –
వెలిగించుము ప్రభుకొరకు
పరిశుద్ధాత్మను పొంది –
ప్రభు వాక్కులు ప్రచురించు
||హల్లెలూయి||
మరణము జయించి లేచెన్ –
మరణపు ముల్లును విరిచెన్
మధురము యేసుని నామం –
మరువకు యేసుని ధ్యానం
||హల్లెలూయి||
Click Here : Randi Sthutinchu Padudi
Leave a Reply